Sithara | 40 ఏళ్లు పూర్తి చేసుకున్న క్లాసిక్

Sithara Movie 40 Years - సుమన్, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సితార. ఈ క్లాసిక్ మూవీ రిలీజై నేటికి 40 ఏళ్లు అవుతోంది.

Advertisement
Update:2024-04-27 13:24 IST

ఫూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక కావ్యం "సితార". ఈ చిత్రం విదుదలై నేటికి 40 సంవత్సరాలు అయింది. ఏప్రిల్ 27, 1984న ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో విడులైంది సితార.




పూర్ణోదయా చిత్రాలైన తాయరమ్మా బంగరయ్య , శంకరాభరణం, సీతాకొకచిలక చిత్రాలకు దర్శక శాఖలో పని చేసిన వంశీ లో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద, అతడికి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన " మహల్లో కోకిల " నవల ఆదారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.

అప్పుడప్పుడే నటునిగా పైకి వస్తున్న హీరో సుమన్ ఇందులో హీరో. ఈ చిత్రంతో భానుప్రియ చిత్రసీమకు పరిచయమైంది. ఒకప్పుడు రాజభోగం అనుభవించిన రాజా గారి వంశం ఇప్పుడు దీనస్థితిలో ఉన్నా, బయట ప్రపంచానికి మాత్రం తమ పరిస్థితులు తెలియనియ్యకుండా రాజవంశపు ఆచారాలు, ఘోషాలు, అలాగే ప్రదర్శిస్తూ ఉండే యువరాజా వారి పాత్రను ప్రముఖ నటుడు శరత్ బాబు అత్యత్భుతంగా పోషించారు.




అలాగే శుభలేఖ సుదాకర్, ఏడిద శ్రీరాం, జే.వీ. సోమయాజులు, సాక్షి రంగారావు, రాళ్ళపల్లి, తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రానికి వంశీ దర్శక ప్రతిభకు అనుగుణంగా మేస్త్రో ఇళయరాజా స్వరపరిచిన సంగీతం ఓ ప్రాణం. పాటలన్నీ ఒక ఎత్తైతే , ఈ చిత్రంలో వచ్చే సైలెంట్ విజువల్స్ కి ఆయన చేసిన రీ రికార్డింగ్ చిత్రాన్ని మరో ఎత్తుకి తీసుకెళ్లింది.

సితార అప్పట్లో 11 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. అలాగే 3 జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ తెలుగు చిత్రం అవార్డుతో పాటు.. వెన్నెల్లో గోదారీ అందం పాటకు గాను ఎస్.జానకికి ఉత్తమ నేపద్య గాయని గా అవార్డు దక్కింది. ఇక అనిల్ మల్నాడ్ కి ఉత్తమ ఎడిటర్ అవార్డు గెలుచుకున్నారు.




Tags:    
Advertisement

Similar News