Cinema Bandi: మరోసారి తెరపైకి 'సినిమా బండి'

Cinema Bandi: సినిమా బండి మరోసారి మెరిసింది. నెట్ ఫ్లిక్స్ లో నేరుగా స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమా, ఇండియన్ పనోరమ విభాగంలో అవార్డ్ అందుకుంది.

Advertisement
Update:2022-11-30 16:12 IST

'సినిమా బండి' 53వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవంలో 'ఇండియన్ పనోరమా'కు ఎంపికై గౌరవాన్ని పొందింది. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల, రచయితలు వసంత్ మరింగటి, కృష్ణ ప్రత్యూష, సంగీత దర్శకుడు, సినిమాటోగ్రఫర్, ఆర్ట్ డైరెక్టర్లు.. ఇలా అందరూ కొత్తవాళ్ళు కలిసి 'సినిమా బండి'ని మనసుని హత్తుకునే విధంగా రూపొందించారు.

ఈ చిత్రానికి రాజ్ - డికె మార్గదర్శకత్వం వహించారు. కొత్త ఫిల్మ్ మేకర్స్, ఇండిపెండెంట్ సినిమాకి మద్దతుగా వీళ్లు తమ సొంత బ్యానర్ పై తీసిన తొలి చిత్రమిది. ది ఫ్యామిలీ మ్యాన్, స్ట్రీ, షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ లాంటి ప్రాజెక్టుల్ని రాజ్-డీకే హ్యాండిల్ చేసిన సంగతి తెలిసిందే.

12 మందికి మించని చిన్న టీంతో తీసిన ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అయినప్పటి నుండి 2 వారాల పాటు నంబర్-1 ట్రెండింగ్ గా నిలిచి సూపర్ హిట్టయింది. ఇప్పుడు నేరుగా ఇండియన్ పనోరమకు ఎంపికై, IFFIలో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది.

Tags:    
Advertisement

Similar News