భారత్ లో మరోసారి సినీ గ్లామర్ మెరిసింది. చాలా చోట్ల తారలు విజేతలుగా నిలిచారు. వాళ్లలో కొంతమందిని ఇక్కడ చెప్పుకుందాం..
ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఇక్కడ తొలిసారి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురం నుంచి ఆయన ఎంపికయ్యారు. ఆయన పార్టీకి చెందిన మరో 20 మంది అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఏపీలో ఎక్కువ సీట్లు సాధించిన రెండో అతిపెద్ద పార్టీగా జనసేన నిలిచింది. ఇక బాలకృష్ణ కూడా వరుసగా మూడోసారి గెలిచి తన సత్తా చాటారు.
ఇక హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గెలిచింది. ఆమె బీజేపీ తరఫున బరిలో దిగి విజయం సాధించింది. ఒకప్పటి టాలీవుడ్ నటి రచన, ఎంపీగా అవతరించింది పశ్చిమ బెంగాల్ హుగ్లి నుంచి టీఎంసీ తరఫున బరిలో నిలిచిన రచనా, తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు.
రామాయణం సీరియల్ తో పాపులరైన అరుణ్ గోవిల్ మీరట్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలవగా.. నటి హేమ మాలిని మరోసారి తన ఆధిపత్యాన్ని చూపిస్తూ మూడోసారి గెలిచారు.
ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారి, గోరఖ్ పూర్ నుంచి రవికిషన్ కూడా గెలిచారు. ఇక కేరళలో ని త్రిసూర్ నుంచి బీజేపీ తరఫున సీనియర్ నటుడు సురేష్ గోపి గెలిచారు. మరోవైపు నటి రాధిక, నవనీత్ కౌర్ తమ తమ సెగ్మెంట్లలో ఓటమి చవిచూశారు.