Chiranjeevi | ఎట్టకేలకు సైరాపై స్పందించిన చిరు

Chiranjeevi - సైరా సినిమాతో ఫ్లాప్ చవిచూశారు చిరంజీవి. తాజాగా ఆ సినిమాపై స్పందించారు. తన వెర్షన్ వినిపించారు.

Advertisement
Update:2024-04-13 23:14 IST

చిరంజీవి చాలా నమ్మకం పెట్టుకున్న సినిమా సైరా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్ పై తెరకెక్కిన ఆ మూవీ ఫెయిల్ అయింది. తాజాగా దీనిపై మరోసారి స్పందించారు చిరంజీవి. సినిమా ఫ్లాప్ అని అంగీకరించారు.

"నేను పూర్తి సంతృప్తితో ఉన్నానని చెప్పలేను. ఇంకా మంచి పాత్రలు చేయాలనే కోరిక ఉంది. కానీ మనం ఆశించే పాత్రలు ప్రతిసారి రావు. అనుకోకుండా వస్తాయి. ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర చేయాలని నాకు చాలా ఏళ్లుగా కోరిక ఉంది. అందుకే పట్టుబట్టి సైరా సినిమా చేశాను. తెలుగు రాష్ట్రాల్లో అది యావరేజ్ గా ఆడింది. దేశం మొత్తమ్మీద చూసుకుంటే అది ఏమంత పెద్ద విజయం సాధించలేదు. ఆ సినిమాను ఎంపిక చేసుకున్నందుకు, నిర్మించినందుకు నేనేమీ బాధపడడం లేదు. నిజానికి ఆ సినిమా వల్ల మేం చాలా నష్టపోయాం. కానీ బాధలేదు. నా ఉద్దేశంలో మంచి పాత్రలు చేసే కంటే, నిర్మాత నష్టపోకుండా ఉండడమే నాకు కావాలి."

మంచి పాత్రలు, కథల కోసం నిత్యం ఎదురుచూస్తూనే ఉంటానన్నారు చిరంజీవి. ఇప్పుడున్న యంగ్ దర్శకులు చాలామంది తనను విభిన్నంగా చూపించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

"మంచి కంటెంట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. నాకు నచ్చితే కచ్చితంగా చేస్తాను. నాకు ఎలాంటి అంచనాలు, టార్గెట్స్ లేవు. ఎలాంటి సినిమాలు చేయాలో నా కంటే, ఇప్పుడున్న యంగ్ డైరక్టర్స్ కు బాగా తెలుసు. చిన్నప్పట్నుంచి వాళ్లు నా సినిమాలు చూసి పెరిగారు. నేను ఏ సినిమాలో, ఏ స్టయిల్ లో నటిస్తే జనాలకు నచ్చుతుందో వాళ్లకు బాగా తెలుసు. మంచి కంటెంట్ దొరికితే, యంగ్ డైరక్టర్స్ మాత్రమే నన్ను బాగా చూపించగలరని నా నమ్మకం."

ఈ విషయంలో రజనీకాంత్ తనకు స్ఫూర్తి అన్నారు చిరంజీవి. ఓ సందర్భంలో రజనీకాంత్ తనకు ఈ సలహా ఇచ్చారని, అప్పట్నుంచి యంగ్ డైరక్టర్స్ తో చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలిపారు చిరంజీవి. 

Tags:    
Advertisement

Similar News