Pawan Allu Arjun | కలిసిపోవడానికి ఒక్క సందర్భం చాలు

Pawan, Bunny - ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో చిన్న చీలిక కనిపిస్తోంది. అయితే అదంతా తాత్కాలికం అంటున్నాడు నిర్మాత బన్నీ వాస్.

Advertisement
Update:2024-07-21 22:44 IST

ప్రస్తుతం మెగాకాంపౌండ్ లో చిన్న చీలిక కనిపిస్తోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తే, అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నేతకు సపోర్ట్ చేశారు. నంధ్యాల వెళ్లి మరీ మద్దతు తెలిపి వచ్చారు. దీంతో మెగా కాంపౌండ్ లో కొంతమంది బన్నీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఇదంతా తాత్కాలికం అంటున్నాడు బన్నీ వాసు. కాంపౌండ్ కు అత్యంత దగ్గరగా ఉండే ఈ వ్యక్తి, ఓ మంచి సందర్భం వచ్చినప్పుడు కాంపౌండ్ లో అంతా కలిసిపోతారని, తనకు ఆ నమ్మకం ఉందని అన్నాడు.

"మెగా కాంపౌండ్ లో వ్యక్తుల్ని, వాళ్ల మధ్య అనుబంధాల్ని 20 ఏళ్లుగా నేను చూస్తున్నాను. చిరంజీవి ఎప్పుడూ ఫ్యామిలినీ కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తారు. సంక్రాంతికి కుటుంబాలన్నింటినీ తీసుకెళ్తారు. దానికి కారణం కుటుంబం అంతా కలిసి ఉండాలనే. తామంతా ఒకటే అనే సందేశం పంపించాలనేది ఆయన ప్రయత్నం. కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి. కొంతమంది వ్యక్తిగత స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ఒక్కటి చూపించి మెగా ఫ్యామిలీలో చీలిక అని చెప్పడం కరెక్ట్ కాదు. మెగా కుటుంబంలో వ్యక్తుల మధ్య బాండింగ్ నాకు తెలుసు. ఏదైనా కష్టం వస్తే వాళ్లు ఒకరికోసం ఒకరు ఎలా నిలబడతారో నాకు తెలుసు. వాళ్లంతా కలిసే ఉన్నారని నాకు తెలుసు. బయటకు తెలియడానికి ఏదైనా సందర్భం రావాలి. ఆ సందర్భం కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను."

ప్రస్తుతం మార్కెట్లో వినిపిస్తున్న ఉహాగానాలు, వివాదాలన్నీ తేలిపోయే మేఘాల్లాంటివని.. ఎప్పుడైతే పవన్, బన్నీ, చిరంజీవి కలిసి ఒకేసారి కనిపిస్తారో, అప్పుడు అన్ని పుకార్లు మాయమైపోతాయని, ఆ రోజు కోసం తను వెయిట్ చేస్తున్నానని అన్నాడు.

Tags:    
Advertisement

Similar News