Boyapati Geetha Arts | బోయపాటి తదుపరి సినిమా వివరాలు

Boyapati Srinu - స్కంద సినిమా తర్వాత బోయపాటి శ్రీను చేయబోయే సినిమా వివరాలు బయటకొచ్చాయి. గీతాఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి సినిమా ఉంటుంది.

Advertisement
Update:2024-01-26 21:48 IST

స్కంద సినిమా తర్వాత బోయపాటి శ్రీనుపై చాలా విమర్శలు చెలరేగాయి. కుర్ర హీరో, సీనియర్ హీరో అనే తేడా లేకుండా అందరితో ఒకే రకమైన టెంప్లేట్ సినిమాలు తీస్తున్నాడంటూ కామెంట్స్ పడ్డాయి. అదే టైమ్ లో స్కంద తర్వాత బాలయ్యతో బోయపాటి సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు కూడా చెలరేగాయి.

ఎట్టకేలకు బోయపాటి నెక్ట్స్ సినిమాపై క్లారిటీ వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు గీతాఆర్ట్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. బోయపాటి, అల్లు అరవింద్ కలిసి దిగిన ఫొటోను కూడా మీడియాకు వదిలారు.

గతంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమా చేశాడు బోయపాటి. ఆ సినిమాతో బన్నీకి పూర్తిస్థాయిలో యాక్షన్ ఇమేజ్ వచ్చింది. అప్పట్నుంచి బన్నీ-బోయపాటి కాంబోపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.

ఎట్టకేలకు గీతాఆర్ట్స్ లో మూవీ అనగానే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి హీరోను లాక్ చేయలేదు. అల్లు అర్జున్ కు బోయపాటితో సినిమా చేయాలని ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అతడు ఖాళీగా లేడు.

సో.. గీతాఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. 

Tags:    
Advertisement

Similar News