Chiranjeevi: చిరంజీవి కెరీర్‌పై పుస్తకం.. రూ. 4 లక్షలకు కొన్న అభిమాని

Chiranjeevi: చిరంజీవి సినిమా కెరీర్‌పై ఒక పుస్తకాన్ని రాశారు. సినీ ఇండస్ట్రీతో ఎన్నో ఏళ్లుగా కలిసిపోయిన జర్నలిస్ట్ ప్రభు 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' అనే పుస్తకాన్ని రచించారు.

Advertisement
Update:2022-10-31 17:15 IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెనుక సపోర్ట్ లేకపోయినా ఒక సాధారణ వ్యక్తిగా పరిశ్రమలోకి అడుగు పెట్టి ఇవ్వాళ మెగాస్టార్‌గా టాలీవుడ్‌ను శాసిస్తున్నారు. ఆరు పదుల వయసు దాటినా తన నటన, డ్యాన్సులు, కామెడీ టైమింగ్‌తో అందరినీ అలరిస్తున్నారు. సినిమాల్లోకి ఎందరో వస్తుంటారు పోతుంటారు. కానీ చిరంజీవి మాత్రం శాశ్వతం అని ఆయన అభిమానులు అంటుంటారు. అలాంటి ఒక ఫ్యాన్ ఆయన ప్రస్థానాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు.

చిరంజీవి సినిమా కెరీర్‌పై ఒక పుస్తకాన్ని రాశారు. సినీ ఇండస్ట్రీతో ఎన్నో ఏళ్లుగా కలిసిపోయిన జర్నలిస్ట్ ప్రభు 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' అనే పుస్తకాన్ని రచించారు. నలబై ఏళ్లుగా ఇండస్ట్రీ వార్తలు రాస్తున్నప్రభు.. చిరంజీవి కెరీర్‌కు సంబంధించిన అనేక విశేషాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు. ఈ పుస్తకాన్ని చిరంజీవే స్వయంగా విడుదల చేశారు. తొలి ప్రతిని చిరంజీవి అభిమాని, నిర్మాత, టీఆర్ఎస్ నాయకుడు రవి పనస రూ. 4 లక్షలు పెట్టి కొన్నారు. మెగాస్టార్ చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని రవి అందుకోవడం విశేషం.

అనంతరం రవి పనస మాట్లాడుతూ "నేను 20 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీ లో ఉన్నాను. మెగా స్టార్ చిరంజీవి గారికి వీర అభిమాన్ని. నేను చిరంజీవి గారు చేసిన థంబ్స్ అప్ యాడ్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఈరోజు ఈ ఫంక్షన్ కి రావటానికి కారణం చిరంజీవి గారు" అని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News