ఈడీ ఎదుట హాజరైన బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి తమన్నా భాటియా గౌహతిలోని ఈడీ ఎదుట హాజరైంది.

Advertisement
Update:2024-10-17 21:48 IST

బాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా అస్సాం రాష్ట్రంలో గౌహతి ఈడీ ఎదుట హాజరైంది. ఇటివల ఈడీ తమన్నాకు నోటీసులు ఇవ్వడంతో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె తల్లి కూడా ఆమెతో వచ్చింది. తమన్నాఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను చూడడాన్ని ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను దాదాపు ఐదు గంటలపాటు ఈడీ విచారించారు. కానీ HPZ యాప్‌కు ప్రచారం చేసినందుకు విచారిస్తున్నామని ఈడీ తెలిపింది. ఈ యాప్ ద్వారా ప్రజలు రూ. 57,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.4,000 ఇస్తామని హామీ ఇచ్చారు.

దీని ద్వారా కోట్లాది మంది పైసాలు పెట్టి మోసపోయారు. చీటింగ్ చేసేందుకు డొల్ల కంపెనీల పేరుతో వివిధ బ్యాంకుల్లో ఫేక్ ఖాతాలు తెరిచి పెట్టుబడిదారుల నుంచి నగదు బదిలీ చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. నిందితులు ఈ మనీనీ క్రిప్టో, బిట్‌కాయిన్లలో పెట్టుబడి పెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 497.20 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ విషయం కూడా మహాదేవ్ యాప్ స్కామ్‌తో ముడిపడి ఉంది. ప్రజలు దీని ద్వారా డబ్బు సంపాదించి మహాదేవ్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టేవారు.

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ