బడా ఫ్లాపులు ఛోటా హిట్లు కష్టం బాసూ!

పెద్ద సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడం వల్ల మందగమనంలో పడింది బిజినెస్. కొన్ని చిన్న సర్ప్రైజ్‌లు మంచి కంటెంట్ తో ఉల్లాసాన్ని తెచ్చిపెట్టినా అవి పెద్ద విజయాల కిందికి రావు. బాక్సాఫీసు క్షీణించడంతో సినిమాల మార్కెట్ డల్ గా వుంది. మార్కెట్ లో ప్రధాన భాగమైన హిందీ సినిమాల పనితీరుతోనే వచ్చింది సమస్య. అయినా బాలీవుడ్ పద్ధతి మార్చుకోవడం లేదు.

Advertisement
Update:2024-07-09 19:30 IST

మల్టీప్లెక్సులు ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. సినిమాలు హిట్టవుతున్నాయి. అందులో ఎలాటి సందేహం లేదు. కానీ ఆ హిట్లు చాలడం లేదు. పెద్ద పెద్ద హిట్లు కావాలి. కానీ చిన్న చిన్న సినిమాలు హిట్టవుతున్నాయి. పెద్ద సినిమాలు హిట్ కావడం లేదు. చిన్న సినిమాలు హిట్టయినా వాటి వసూళ్ళ మొత్తంతో సుఖం లేదు. పెద్ద సినిమాలు హిట్టయితే మంచి లాభాలతో నడుస్తాయి మల్టీప్లెక్సులు. పెద్ద సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడం వల్ల మందగమనంలో పడింది బిజినెస్. కొన్ని చిన్న సర్ప్రైజ్‌లు మంచి కంటెంట్ తో ఉల్లాసాన్ని తెచ్చిపెట్టినా అవి పెద్ద విజయాల కిందికి రావు. బాక్సాఫీసు క్షీణించడంతో సినిమాల మార్కెట్ డల్ గా వుంది. మార్కెట్ లో ప్రధాన భాగమైన హిందీ సినిమాల పనితీరుతోనే వచ్చింది సమస్య. అయినా బాలీవుడ్ పద్ధతి మార్చుకోవడం లేదు.

2023- 24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మల్టీప్లెక్స్ పరిశ్రమలో పరిస్థితులు ఎలా ముగిశాయో అలా వుంచితే, 2024- 25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం మాత్రం బ్రహ్మాండంగా ఏమీ లేదు. 2023 - 24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టాప్ మల్టీప్లెక్స్ పీవీఆర్- ఐనాక్స్ రెండు త్రైమాసికాల తర్వాత మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. ఊహించిన రూ. 118 కోట్ల కంటే రూ. 133 కోట్లు ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. 2024-25 ఆర్ధిక సంవత్సరపు మొదటి త్రై మాసికంలో కంటెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ మందగమనం కొనసాగుతుందని భావిస్తున్నారు.

ఇది మల్టీప్లెక్స్ పరిశ్రమకి సవాలుగా మారింది.. ఏప్రిల్-మే-జూన్ మొత్తం మూడు మాసాల బాక్సాఫీసు పనితీరు బలహీనంగా వుంది. ఇది బ్లాక్‌బస్టర్ సినిమాలు లేకపోవడం వల్ల, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి ప్రధాన క్రీడా ఈవెంట్‌లు, 2024 టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ మొదలైనవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం వల్ల తలెత్తిన సమస్యగా భావిస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం బాలీవుడ్ నిదానంగా ప్రారంభమైందని, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘బడే మియా చోటే మియా’ ‘ మైదాన్’ పెద్ద సినిమాలు రెండూ నిరాశపరిచాయని ఒక విశ్లేషకుడు తెలిపారు. ఈ ఆర్ధికసంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-మే-జూన్) లో హిందీ బాక్సాఫీసు 34 శాతం క్షీణించే అవకాశం వుందని ముందుగానే అంచనా వేశారు.

కొన్ని చిన్న-మధ్యతరహా-బడ్జెట్ సినిమాలు బాగా ఆడాయి. కానీ అది సరిపోలేదు. హాలీవుడ్ సినిమాలు కూడా లోటుని తీర్చలేదు. ‘కల్కి 2898 ఏడీ’ ఒక్కటే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ‘ఆవేశం’, ‘గురువాయూర్ అంబలనాదయిల్ ‘, ‘ఆడుజీవితం’ వంటి సినిమాలతో మలయాళ రంగం మంచి పనితీరుని కనబర్చింది. తమిళంలో కూడా ‘అరణ్మనై 4’ ‘మహారాజా’, ‘గరుడన్‌’ మంచి హిట్లుగా నిలిచాయి. తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ తప్ప హిట్ లేదు. కన్నడలో పెద్ద హిట్లే లేవు.

ఇంకా మరాఠీ, పంజాబీ, గుజరాతీ వంటి బహుళ భాషలకి కూడా మే 2024 అత్యధిక వసూళ్ళు రాబట్టిన నెల అయితే, హిందీ సినిమాలకి అత్యల్ప కలెక్షన్లు వచ్చిన నెలగా మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ విశ్లేషణ చేసింది. మే 3న విడుదలైన ‘అరణ్మనై 4’ రూ. 67.4 కోట్ల కలెక్షన్లతో మే నెలలో అత్యధిక వసూళ్ళు సాధించిన చలన చిత్రంగా నిలిచింది. అక్టోబర్ 2023లో ‘లియో’ విడుదలైన తర్వాత దేశీయ బాక్సాఫీసులో ఈ నెలలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చలన చిత్రంగా అవతరించింది ‘అరణ్మనై 4’. ఇంకా ఓర్మాక్స్ విశ్లేషణ ప్రకారం, ‘గురువాయూర్ అంబలనాదయిల్’, ‘టర్బో ‘ వంటి సినిమాల స్థిరమైన వసూళ్ళ కారణంగా మలయాళ పరిశ్రమ బాక్సాఫీసులో దాని 19 శాతం వాటాని అలాగే కొనసా

గించింది . ఈ సంవత్సరం మలయాళ సినిమాలు అత్యధికంగా రూ. 600 కోట్లకు పైగా వ్యాపారాన్ని నమోదు చేశాయి. మరోవైపు, మే నెలలో బలహీన పనితీరు కారణంగా హిందీ సినిమాల బాక్సాఫీసు వాటా 36 శాతం నుంచి 33 శాతానికి తగ్గింది.

ఇలా హిందీలో పెద్ద విజయాలు లేకపోవడంతో, పీవీఆర్- ఐనాక్స్ ఆదాయం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో మల్టీప్లెక్స్ వ్యాపారం నెమ్మదిగా ప్రారంభం కాగా, రెండవ త్రైమాసికం (జులై- ఆగస్టు- సెప్టెంబర్) నుంచి పికప్ వుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘కల్కి -2898 ఏడీ’ తో మల్టీప్లెక్స్ వ్యాపారం నెమ్మదిగా మెరుగుపడుతోందనీ, ఆగస్టులో పెద్ద సినిమాల విడుదలలు ఊపునిస్తాయనీ ఆశిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News