Vijay Antony: విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమం..?

Vijay Antony Health Condition: ప్రస్తుతం విజయ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతని పళ్ళు విరిగిపోయాయని, దవడ ఎముక విరిగినట్లు తెలిసిందని చెప్పుకొచ్చారు. ఇక ముఖానికి కూడా దెబ్బలు గ‌ట్టిగా తగిలినట్లు చిత్ర బృందం చెప్పుకొచ్చింది.

Advertisement
Update:2023-01-19 17:22 IST

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ.. రెండు రోజుల క్రితమే బోట్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా.. ఒక బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న పడవను ఢీకొంది.

దీంతో ఒక్కసారిగా విజయ్ ఎగిరి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే మలేషియా బయల్దేరి వెళ్లి విజయ్ పరిస్థితిని తెలుసుకున్నారు.

అక్కడి నుంచి విజయ్‌ను చెన్నైకు తరలించినట్లు విజయ్ భార్య ఫాతిమా తెలిపారు. అంతేకాకుండా విజయ్ పరిస్థితి విషమంగా ఉందని కూడా ఆమె తాజాగా వెల్లడించారు.

ప్రస్తుతం విజయ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతని పళ్ళు విరిగిపోయాయని, దవడ ఎముక విరిగినట్లు తెలిసిందని చెప్పుకొచ్చారు. ఇక ముఖానికి కూడా దెబ్బలు గ‌ట్టిగా తగిలినట్లు చిత్ర బృందం చెప్పుకొచ్చింది. దీంతో విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గర అయిన విజయ్ ఆంటోని.. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News