Milky Beauty | భోళాశంకర్ నుంచి మూడో సాంగ్ రిలీజ్

Bholaa Shankar - భోళాశంకర్ నుంచి మూడో సాంగ్ రిలీజైంది. తమన్ చేతుల మీదుగా రిలీజైన ఈ సాంగ్ ఎలా ఉందో చూద్దాం

Advertisement
Update:2023-07-22 12:13 IST
Milky Beauty | భోళాశంకర్ నుంచి మూడో సాంగ్ రిలీజ్
  • whatsapp icon

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఏకే ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు భోళా మానియా, జామ్ జామ్ జజ్జనక పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం థర్డ్ సింగిల్ ‘మిల్కీ బ్యూటీ’ పాటని రిలీజ్ చేశారు.

మొదటి సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఇక రెండో సాంగ్ ను మణిశర్మ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఇప్పుడు మూడో సాంగ్ ను తమన్ చేతుల మీదుగా విడుదల చేశారు.

మహతి స్వర సాగర్ ఈ పాటని మెలోడీగా స్వరపరిచగా.. విజయ్ ప్రకాష్, సంజన కలసి పాడారు. మహతి స్వర సాగర్ కూడా గొంతు కలిపాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఆకట్టుకుంది.

ఈ పాటలో చిరంజీవి డాన్స్, స్టయిల్ బాగున్నాయి. చిరు తో కలిసి తమన్నా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వచ్చేనెల 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News