Bharateeyudu 2 | భారతీయుడు 2 ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే..?

Bharateeyudu 2 - భారతీయుడు 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. అనిరుధ్ సంగీతం అందించారు.

Advertisement
Update:2024-05-23 14:38 IST

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న సినిమా ‘భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్నారు.

1996లో క‌మ‌ల్, శంక‌ర్ కాంబినేష‌న్‌ లో వచ్చి రికార్డుల‌ు క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా భార‌తీయుడు 2 వస్తోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా మూవీ నుంచి ‘శౌర..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.

పాట‌లో చూపించిన కొన్ని విజువ‌ల్స్ చూస్తుంటే భార‌తీయుడు 2 అంచ‌నాల‌ను మించేలా శంక‌ర్ తెరకెక్కించార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీత సార‌థ్యంలో సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాట‌ను రితేష్ జి.రావ్‌, శ్రుతికా స‌ముద్రాల పాడారు.

ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ‘భార‌తీయుడు 2’ సినిమాను నైజాం, ఆంధ్రాలో ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ విడుదల చేయనుంది. ఇక సీడెడ్ లో శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌ ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది.

Tags:    
Advertisement

Similar News