Bellamkonda | ఒకేసారి 4 సినిమాలు

Bellamkonda - బెల్లంకొండ సాయిశ్రీనివాస్ స్పీడ్ పెంచాడు. తెలుగులో 4 సినిమాలకు ఓకే చెప్పాడు.

Advertisement
Update: 2024-07-25 04:57 GMT

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మెల్లమెల్లగా స్పీడ్ పెంచుతున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో 4 సినిమాలున్నాయి. ఆ సినిమాల ప్రకటనలు కూడా దాదాపు వచ్చేశాయి.

హిందీ డెబ్యూ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు బెల్లంకొండ. దాదాపు టాలీవుడ్ కు దూరమయ్యాడు. అలా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. కానీ ఆ మూవీ దారుణంగా దెబ్బకొట్టింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు.

దీంతో మళ్లీ టాలీవుడ్ కు వచ్చేశాడు. ముందుగా టైసన్ నాయుడు సినిమా స్టార్ట్ చేశాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతున్న టైమ్ లోనే, కౌషిక్ అనే దర్శకుడితో సినిమా ఎనౌన్స్ చేశాడు. తాజాగా సుధీర్ అనే దర్శకుడితో మరో సినిమా కూడా ప్రకటించాడు. వీటితో పాటు, లిస్ట్ లో విజయ్ కనకమేడల సినిమా కూడా ఉంది.

ఇలా తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ. తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లను తీసుకునే ఈ హీరో, ఈసారి నేహా శెట్టి, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ లను తన కొత్త సినిమాల కోసం తీసుకున్నాడు. 

Tags:    
Advertisement

Similar News