Bellamkonda | మరో సినిమా ప్రకటించిన బెల్లంకొండ

Bellamkonda - హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, శ్రీరామనవమి సందర్బంగా కొత్త సినిమా ప్రకటించాడు.

Advertisement
Update:2024-04-17 22:50 IST
Bellamkonda | మరో సినిమా ప్రకటించిన బెల్లంకొండ
  • whatsapp icon

తన 10వ సినిమాతో బిజీగా ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు మరో సినిమా ప్రకటించాడు. మంచి భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన డైనమిక్ నిర్మాత సాహు గారపాటి ఈ సినిమాకు నిర్మాత. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం లో ఈ ప్రాజెక్ట్ రానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ బాగుంది. శ్రీరాముడు తన చేతిలో విల్లుతో బాణాన్ని ఆకాశం లో ఉన్న రాక్షసుడికి ఎక్కుపెట్టడం ఈ శ్రీరామనవమి సందర్భానికి సరిగ్గా సరిపోయింది. తోలుబొమ్మలాట, నిర్జనమైన అడవి, యాంటెన్నా టవర్ లాంటివి పోస్టర్ లో చూపించారు.

భగవంత్ కేసరి సంచలన విజయం తర్వాత, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రాబోతున్న సినిమా ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది. కాంతారా ఫేమ్ బి. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

Tags:    
Advertisement

Similar News