Balakrishna: ప్రయోగం చేయబోతున్న బాలయ్య

ఓవైపు మాస్-యాక్షన్ సినిమాలు చేస్తూనే, మరోవైపు ప్రయోగాలు చేసేందుకు సిద్ధమౌతున్నారు బాలయ్య. ఇందులో భాగంగా వెంకటేష్ మహా అనే దర్శకుడు చెప్పిన డిఫరెంట్ స్టోరీని విన్నారు

Advertisement
Update:2022-11-13 11:06 IST

మంచి కథ దొరికితే ప్రయోగాలు చేయడానికి బాలకృష్ణ ఎప్పుడూ సిద్ధమే. గతంలో భైరవద్వీపం, ఆదిత్య-369 లాంటి సినిమాలు చేశారు బాలయ్య. అయితే ఆయనతో ప్రయోగాలు చేయడానికి దర్శకులు పెద్దగా ఆసక్తి చూపరు. ఆయనకున్న ఇమేజ్, ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకొని యాక్షన్-ఫ్యాక్షన్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

అయితే కొంతమంది దర్శకులు మాత్రం బాలయ్యతో ప్రయోగాలు చేయాలనుకుంటారు. తాజాగా అనీల్ రావిపూడి అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. బాలయ్యను తండ్రి పాత్రలో చూపిస్తున్నాడు. పెళ్లీడుకొచ్చిన కూతురుకు తండ్రిగా బాలయ్యను ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడిదే బాటలో మరో దర్శకుడు చేరాడు.

కేరాఫ్ కంచరపాలెం లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తీసిన వెంకటేష్ మహా, బాలకృష్ణకు ఓ మంచి స్టోరీ చెప్పాడుట. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇప్పటివరకు బాలయ్య టచ్ చేయని జానర్, సబ్జెక్ట్ ఇది.

వెంకటేష్ మహా చెప్పిన స్టోరీ, బాలయ్యకు చాలా బాగా నచ్చిందంట. అయితే ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ బాలయ్య ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే, గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తుంది. గీతాఆర్ట్స్ లో బాలయ్య చేయబోయే తొలి సినిమా అవుతుంది ఇది.

Tags:    
Advertisement

Similar News