Kalpika Ganesh: కల్పిక గణేష్ మాటలను నిజం చేస్తూ కోర్టులో కేసు వేసిన డైరెక్టర్

Kalpika Ganesh and Dhanya Balakrishna: జూనియర్ నటి కల్పిక గణేష్ మరియు హీరోయిన్ ధన్య బాలకష్ణ ల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న గొడవ గురించి అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ఇద్దరు నటిమనులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు.

Advertisement
Update:2022-12-28 15:42 IST

Kalpika Ganesh: కల్పిక గణేష్ మాటలను నిజం చేస్తూ కోర్టులో కేసు వేసిన డైరెక్టర్

జూనియర్ నటి కల్పిక గణేష్ మరియు హీరోయిన్ ధన్య బాలకష్ణ ల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న గొడవ గురించి అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ఇద్దరు నటిమనులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. తాజాగా ధన్య బాలకృష్ణ గురించి కల్పిక గణేష్ కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ధన్య సీక్రెట్ గా డైరెక్టర్ బాలాజీ మోహన్ (లవ్ ఫెయిల్యూర్ సినిమా ఫేమ్) ను పెళ్లి చేసుకుందని గత ఏడాది కాలంగా అతనితోనే ఉంటుందని కల్పిక గణేష్ ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. కానీ ధన్య కంప్లైంట్ ఇవ్వగా కల్పిక ఆ వీడియోని తన చానల్ నుండి డిలీట్ చేసేసింది కల్పిక. ఇక్కడి నుంచి వీరి మధ్య గొడవ మొదలైంది.

అసలు కల్పిక మరియు ధన్య ల మధ్య ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉండగా మరోవైపు బాలాజీ మోహన్ కోర్టులో కేసు వేయడం అందరినీ షాక్ కు గురిచేస్తుంది. 2022 జనవరిలో ధన్య ని తాను పెళ్లి చేసుకున్నట్లుగా డైరెక్టర్ బాలాజీ మోహన్ ఒప్పుకున్నారు.

అంతే కాకుండా తన తమ వ్యక్తిగత జీవితం గురించి కానీ పెళ్లి గురించి కానీ సోషల్ మీడియాలో కల్పిక గణేష్ పోస్ట్ చేయడం ఆపేయాలి అని ఆయన కోర్టులో పిటిషన్ పెట్టారు. దీంతో ధన్య కి నిజంగానే పెళ్లయింది అని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది.

మరోవైపు బాలాజీ మోహన్ కి ఇదివరకే వేరొకరితో పెళ్లి అయ్యింది కానీ కొన్నాళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. మరోవైపు ధన్య చిన్నా చితకా సినిమాలు చేస్తూ కరియర్లో ముందుకు దూసుకు వెళుతోంది. ఈ మధ్యనే ధన్య "జగమే మాయ" అనే సినిమాతో బాగానే మెప్పించింది. మరోవైపు కల్పిక గణేష్ సమంత నటించిన "యశోద" సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.

Tags:    
Advertisement

Similar News