Avatar 2: 500 మిలియన్ డాలర్లు

Avatar the way of water: జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన అవతార్-2 సినిమా తాజాగా 500 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.

Advertisement
Update:2022-12-21 17:45 IST

'Avatar: The Way of Water' to premier from 12 AM in India

జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్-ది వే ఆఫ్ వాటర్ (Avatar 2) ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అత్యంత వేగంగా 500 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఆరో చిత్రంగా అవతార్-2 రికార్డ్ సృష్టించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు అత్యథికంగా వసూళ్లు అందిస్తున్న దేశాల్లో భారత్ ముందువరసలో ఉంది. ఇండియాలో ఈ సినిమా ఇప్పటివరకు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ 200 కోట్ల రూపాయల్లో దాదాపు 60శాతం సౌత్ ఇండియా నుంచి వచ్చింది.

జేమ్స్ కామరూన్ డైరక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల వసూళ్లు రావాలి. ఇది ఏ మేరకు ఆ స్థాయిని అందుకుంటుందనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది.

మరోవైపు సౌత్ ఆసియాలో ఈ సినిమాకు సంబంధించి డిఫరెంట్ ట్రెండ్ నడుస్తోంది. సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమాను చూసేందుకు ఆసియా ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. కాస్త రేటు ఎక్కువైనా త్రీడీ, 4డీఎక్స్ లేదా ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో మాత్రమే అవతార్-2ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమ దేశాల్లో ఈ ట్రెండ్ కనిపించడం లేదు.

Tags:    
Advertisement

Similar News