విజయ్‌ దేవరకొండ, రష్మిక రిలేషన్‌లో ఉన్నారా?

తాను సింగిల్‌ కాదని, రిలేషన్‌లో ఉన్నానని ఇటీవల విజయ్‌ దేవరకొండ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రష్మికతో ఉన్న ఫొటో నెట్టింట వైరల్‌

Advertisement
Update:2024-11-24 11:01 IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మరోసారి వార్తల్లో నిలిచారు. గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ జంట రిలేషన్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జోడికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెస్టారెంట్‌లో వీళ్లిద్దరూ కనిపించారు. దీంతో ఎవరో ఈ ఫొటోను సీక్రెట్‌గా తీసి నెట్టింట షేర్‌ చేసినట్లు సమాచారం. అయితే ఈ ఫొటో ఎప్పటిది అనేదానిపై స్పష్టత లేదు.

అయితే వాళ్లిద్దరి రిలేషన్‌ గురించి వస్తున్న వార్తలపై ఈ జంట అనేకసార్లు స్పందించింది. తాము మంచి ఫ్రెండ్స్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయినా వీరిపై వార్తలు ఆగడం లేదు. వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని బాలీవుడ్‌ నటి అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా హింట్‌ ఇచ్చారు. దీనికితోడు తన మ్యూజిక్‌ ఆల్బమ్‌ 'సాహిబా' ప్రమోషన్స్ లో భాగంగా విజయ్‌ దేవరకొండ తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సింగిల్‌ కాదని, రిలేషన్‌లో ఉన్నానని చెప్పారు. కోస్టార్‌తో డేటింగ్‌ చేశానని తెలిపారు. విజయ్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సమయంలో ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడం గమనార్హం. దీంతో వీళ్లిద్దరి లవ్‌ మ్యాటర్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. 

Tags:    
Advertisement

Similar News