Arbaaz Khan | మలైకా మాజీ భర్త రెండో పెళ్లి

Arbaaz Khan - మలైకా అరోరా నుంచి విడిపోయిన తర్వాత సురా ఖాన్ కు దగ్గరయ్యాడు అర్బాజ్ ఖాన్. ఆమెనే తాజాగా నిఖా చేసుకున్నాడు.

Advertisement
Update:2023-12-25 15:30 IST

బాలీవుడ్ లో మరో పెళ్లి జరిగింది. ఈసారి అర్బాజ్ ఖాన్ వంతు. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సురా ఖాన్ ను పెళ్లాడాడు నటుడు అర్బాజ్ ఖాన్. వీళ్ల పెళ్లి అతికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో సింపుల్ గా జరిగింది.

అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 19 ఏళ్ల పాటు సంసారం చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. 2017లో వాళ్లు విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి సురా ఖాన్ తో ఉంటున్న అర్బాజ్, ఎట్టకేలకు ఆమెను వివాహం చేసుకున్నాడు.

అర్బాజ్ ఖాన్ సోదరి అర్పితా ఇల్లు ఈ పెళ్లికి వేదికైంది. అర్పితా ఇంటి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికలో అర్బాజ్-సురా ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి అర్బాజ్ ఖాన్ సోదరులు సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్ హాజరయ్యారు. రవీనా టాండన్, జెనీలియా లాంటి తారలు కూడా హాజరయ్యారు. రవీనా టాండన్ కు పర్సనల్ మేకప్ అసిస్టెంట్ గా పనిచేసింది సురా ఖాన్.

తను సురాను పెళ్లి చేసుకున్నట్టు అర్బాజ్ ఖాన్ ప్రకటించాడు. ఈ మేరకు అతడు కొన్ని ఫొటోల్ని విడుదల చేశాడు. పెళ్లికి సల్మాన్ హాజరైనప్పటికీ, అతడికి సంబంధించిన ఫొటోల్ని మాత్రం విడుదల చేయలేదు. 

Tags:    
Advertisement

Similar News