Anushka Sharma | 5 రోజుల కిందటే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
Anushka Sharma - విరాట్ కోహ్లి మరోసారి తండ్రి అయ్యాడు. అనుష్క శర్మ, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అనుష్క శర్మ గర్భంపై ఈమధ్య కాలంలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోందని కొందరు, లేదని మరికొందరు ప్రకటనలు చేశారు. క్రికెటర్ ఏబీ డెవిలియర్స్ అయితే ముందుగా ఒకటి ప్రకటించి, ఆ తర్వాత ఏకంగా క్షమాపణలు చెప్పాడు. వాళ్లకు ప్రైవసీ ఇవ్వాలని కోరాడు.
ఇప్పటికీ ఓవైపు ఇలా చర్చ నడుస్తూనే ఉంది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆల్రెడీ అనుష్క శర్మ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 5 రోజుల కిందటే విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులకు బాబు పుట్టాడు.
ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించింది ఈ జంట. తమకు బాబు పుట్టాడని బాహ్యప్రపంచానికి తెలియజేశారు. వీళ్లకు ఇప్పటికే వమిక అనే అమ్మాయి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పుట్టిన బాబుకు అకాయ్ అనే పేరుపెట్టారు.
అందరి దీవెనలు, శుభాకాంక్షలు తమకు కావాలని తెలిపిన ఈ జంట, అదే టైమ్ లో తమ ప్రైవసీని గౌరవించాలని కోరింది. బాలీవుడ్ ప్రముఖుల నుంచి క్రికెటర్ల వరకు చాలామంది ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.