పూమా.. పెద్ద డ్రామా.. అనుష్క తెలివి మామూలుగా లేదుగా!

'అనుష్క x పూమా' అని రాసున్న ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్‌ను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Advertisement
Update:2022-12-21 09:12 IST

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ పూమాకు మధ్య గత రెండు రోజులుగా సాగుతున్న వివాదం అంతా డ్రామానే అని తెలిసిపోయింది. ఇదంతా పబ్లిసిటీలో భాగంగానే చేసినట్లు ఇవాళ పేపర్లు చూస్తే అర్థం అవుతోంది. అమ్మో.. అనుష్క తెలివి మామూలుగా లేదని.. అమె ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ పూమా రెండు రోజుల క్రితం అనుష్క శర్మ ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో వాడింది. అందులో అనుష్క పూమా లోగో ఉన్న దుస్తులు ధరించి ఉంది.

కాగా, ఈ ఫొటోపై అనుష్క శర్మ అభ్యంతరం తెలిపింది. తన అనుమతి లేకుండా ఫొటోలు ఎలా వాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అనుమతి లేకుండా మీరు నా ఫోటోలను ఏ బ్రాండ్ పబ్లిసిటీ కోసం ఉపయోగించలేరు, ఎందుకంటే నేను మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌ని కాదు. దయచేసి దాన్ని తీసివేయండి' అంటూ స్టోరీలో రాసుకొచ్చింది. అనుష్క స్టోరీని బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆమె భర్త విరాట్ కోహ్లీ కూడా షేర్ చేశాడు. దీంతో పూమా కూడా రెస్పాండ్ అయ్యింది.

'అనుష్క x పూమా' అని రాసున్న ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్‌ను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అంతే కాకుండా.. హే అనుష్క, మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటాము. మనం దీన్ని మరో లెవెల్‌కు తీసుకొని వెళ్దామా అంటూ పూమా పేర్కొంది. అయితే, ఈ విషయంపై రేపు ఆలోచిద్దాం అంటూ అనుష్క రెస్పాండ్ అయ్యింది. కట్ చేస్తే.. బుధవారం ప్రింట్ మీడియాలో పూమా బ్రాండ్స్‌ను అనుష్క ప్రమోట్ చేస్తూ భారీ యాడ్స్ కనపడ్డాయి. 'షీ సెయిడ్ ఎస్' (ఆమె ఒప్పుకుంది) అంటూ పూమా యాడ్స్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనుష్క ఇంత మోసం చేసిందా? రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ అంతా డ్రామానా అని కామెంట్లు పెడుతున్నారు.

వాస్తవానికి విరాట్ కోహ్లీ 2017 నుంచి పూమా బ్రాండ్‌కు ఇండియాలో అంబాసిడర్‌గా ఉన్నాడు. ఎనిమిదేళ్లకు గాను రూ.110 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2025లో తన కాంట్రాక్టు ముగిసిపోతోంది. అయితే, ఇటీవల కోహ్లీ-అనుష్క పలు బ్రాండ్లకు కలిసి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు పూమా విషయంలో కూడా ఇద్దరూ కలిపి ప్రమోట్ చేయనున్నారు. రాబోయే రెండేళ్లు అనుష్కతో కలిసి పూమాను ప్రమోట్ చేయబోతున్నట్లు స్పష్టమైంది. మొత్తానికి అనుష్క రెండు రోజులు సోషల్ మీడియాలో చేసిన హడావిడి అంతా డ్రామానే అని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.



 


Full View

 



Tags:    
Advertisement

Similar News