Anupama Parameswaran | రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు

Anupama Parameswaran - రొమాంటిక్ సన్నివేశాల్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు కానీ, నటించేటప్పుడు తాము మాత్రం ఎంజాయ్ చేయలేమని చెబుతోంది అనుపమ.

Advertisement
Update:2024-03-26 09:36 IST

రొమాంటిక్ సీన్లలో నటించడం, తెరపై రొమాన్స్ పండించడం అంత ఈజీ కాదంటోంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. దానికి చాలా కష్టపడాలని, మానసికంగా ఎంతో ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది.

"రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ కాదు. చుట్టూ వంద మంది ఉంటారు. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడం అనేది ప్రైవేట్ వ్యవహారం. అలాంటి సన్నివేశాన్ని వంద మంది చుట్టూ చేసి చూపించడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోండి. అందరూ కారు సీన్ గురించి మాట్లాడుతున్నారు. అది చేసినప్పుడు ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యానో ఎవ్వరికీ తెలియదు. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడం ఎంత కష్టమో ఎవ్వరికీ తెలియదు. షూటింగ్ లో ఉన్న పరిస్థితుల్లో ఓ పాత్రలోకి ప్రేక్షకుల్ని లీనం అయ్యేలా చేయడం అంత ఈజీగా కాదు. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలతో మెప్పించడం చాలా కష్టం. చూసినవాళ్లు ఆ సన్నివేశాల్ని ఎంజాయ్ చేస్తారు, చేసిన మేం కాదు."

నటించడమే కష్టమని, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం ఇంకా కష్టమని తెలిపింది అనుపమ. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన టిల్లూ స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అనుపమ. కెరీర్ లో తొలిసారి ఈ సినిమాలో బోల్డ్ లుక్ లో ఆమె నటించింది. లిప్ కిస్ లు పెట్టడం నుంచి, కాస్త ఎక్స్ పోజింగ్ వరకు ఆమె పాత్ర బోల్డ్ గా ఉంటుంది. ఈ సినిమా ప్రచారంలోనే పైవిధంగా స్పందించింది అనుపమ.

Tags:    
Advertisement

Similar News