పాత్ర డిమాండ్ చేస్తే లిప్ కిస్ కు ఓకే అంటోంది

రౌడీ బాయ్స్ సినిమాలో గ్లామరస్ గా కనిపించింది అనుపమ పరమేశ్వరన్. అలాంటి మంచి పాత్రలు దొరికితే బోల్డ్ గా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది.

Advertisement
Update:2022-08-20 13:26 IST

దక్షిణాదిన ఇటు హీరోయిన్ గా అటు కీలక పాత్రధారిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది అనుపమ పరమేశ్వరన్. ముక్కుసూటితనం, ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం. కోవిడ్ తరువాత స్పీడ్ పెంచిన ఈ భామ రౌడీ బాయ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. కార్తికేయ 2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది ఈ సినిమా. ఈ సందర్భంగా మరోసారి మీడియాతో మాట్లాడిన అనుపమ.. పాత్ర డిమాండ్ చేస్తే లిప్ కిస్ ఓకే అంటోంది.

"రౌడీ బాయ్స్ లో ఎక్కువ గ్లామర్ గా ఉండాలని చేసిన పాత్ర కాదు. యూత్ ఫిలిం కాబట్టి కావాలని ముద్దు సీన్లు పెట్టారని అనుకున్నారు. కానీ సిచ్యుయేషన్ డిమాండ్ మేరకు ముద్దు సీన్స్ లో నటించాను. భవిష్యత్తులో కూడా పాత్ర డిమాండ్ చేస్తే ముద్దు సీన్లలో నటిస్తాను. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు."

ఇలా పాత్రల ఎంపిక విషయంలో తను చాలా బోల్డ్ గా ఉంటాననే విషయాన్ని బయటపెట్టింది అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ-2 సక్సెస్ ను ఓవైపు ఎంజాయ్ చేస్తూనే, తను ఎలాంటి పాత్రలు కోరుకుంటుందో ఇలా మరోసారి బయటపెట్టింది అనుపమ.

తాజా ప్రకటనతో అనుపమకు మరికొన్ని గ్లామరస్ రోల్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈమె గ్లామరస్ పాత్రలు పోషించింది చాలా తక్కువ. ఆ లోటు ఆమెకు కూడా తెలుసు. అందుకే ఇలా లిప్ కిస్ టాపిక్ ఎత్తుకుంది.

Tags:    
Advertisement

Similar News