ఇది కాపీ కథ కాదు.. నా ఫ్రెండ్ జీవితం

దాదాపు అంటే సుందరానికి కాన్సెప్ట్ తోనే కృష్ణ వ్రిందా విహారి అనే సినిమా కూడా వస్తోందనే ప్రచారం ఉంది. దీనిపై కృష్ణ వ్రింద విహారి దర్శకుడు అనీష్ కృష్ణ స్పందించాడు...

Advertisement
Update:2022-09-18 12:44 IST

త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న కృష్ణ వ్రిందా విహారి సినిమాపై ఓ పుకారు జోరుగా వినిపిస్తోంది. ఈమధ్య నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి సినిమాకు, శర్వానంద్ సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయంటూ కథనాలు వస్తున్నాయి. వీటిపై అప్పట్లో అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణ వ్రిందా విహారి దర్శకుడు అనీష్ క్రిష్ణ కూడా క్లారిటీ ఇస్తున్నాడు.

"ఇప్పటివరకూ ఇందులో ఉన్న యూనిక్ పాయింట్ ని ఇంకా రివీల్ చేయలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కథపై ఒక అవగాహన ఇస్తాం. అయితే ఈ కథకి మూలం మాత్రం చెప్తాను. నాకు బాగా కావాల్సిన సన్నిహితుడి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఫ్రేమ్ చేసుకున్న స్టోరీలైన్ ఇది. నేను స్ఫూర్తి పొందింది అతడి దగ్గర్నుంచి మాత్రమే. బయట ఏవేవో వినిపిస్తున్నాయి. నాకు సంబంధం లేదు."

ఇలా కృష్ణ వ్రింద విహారి కథను తన సొంత కథగా చెప్పుకొచ్చాడు అనీష్ కృష్ణ. తను నెరేషన్ లో చాలా వీక్ అని, ఇప్పటివరకు ప్రతి కథను తన టీమ్ సభ్యుల ద్వారా మాత్రమే హీరోలకు వినిపించానని చెప్పిన ఈ దర్శకుడు.. కృష్ణా వ్రిందా విహారి కథను మాత్రం నాగశౌర్యకు తనే స్వయంగా నెరేషన్ ఇచ్చినట్టు వెల్లడించాడు. కథపై తనకు అంత నమ్మకం ఉందని, శౌర్య ఒప్పుకోవడంతో తన నమ్మకం నిజమైందని అంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News