Butta Bomma Movie Trailer Review: బుట్టబొమ్మ ట్రయిలర్ రివ్యూ

Butta Bomma Movie Trailer Review: బాలనటి అనిక సురేంద్రన్ హీరోయిన్ గా మారి చేసిన సినిమా బుట్టబొమ్మ. తాజాగా విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ అయింది.

Advertisement
Update:2023-01-28 20:32 IST

Butta Bomma Movie Trailer Review: బుట్టబొమ్మ ట్రయిలర్ రివ్యూ

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఫీల్ గుడ్ రూరల్ డ్రామా 'బుట్ట బొమ్మ'. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకకు విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన చేతుల మీదుగా విడుదలైన 'బుట్ట బొమ్మ' ట్రైలర్ రిలీజైంది..

'బుట్టబొమ్మ' కథ అరకు ప్రాంతంలో జరుగుతుంది. అరకులోని అందమైన లొకేషన్లను చూపిస్తూ ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. ఇందులో అనిఖా సురేంద్రన్ ఒక సాధారణ మధ్యతరగతి యువతిగా కనిపిస్తోంది. చిన్న చిన్న కోరికలు, కొన్ని బాధ్యతలు, వయసొచ్చిన ఆడపిల్ల ఉన్న తండ్రి పడే ఆందోళన మధ్య ఆమె పాత్ర పరిచయమైంది.

అనుకోకుండా ఫోన్ ద్వారా ఆమెకు ఆటో డ్రైవర్(సూర్య వశిష్ఠ)తో పరిచయం కావడం, అది ప్రేమ వరకు వెళ్లడం జరుగుతుంది. అయితే ఎంతో హాయిగా సాగిపోతున్న వారి ప్రేమ కథలోకి అర్జున్ దాస్ పాత్ర రాకతో అలజడి మొదలవుతుంది. నేర చరిత్ర, రాజకీయ పలుకుపడి ఉన్న అతను వీరి జీవితాల్లోకి ఎందుకు వచ్చాడు? అతని రాకతో ఈ ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తిని రేకెత్తించేలా రూపొందించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం, గోపి సుందర్ నేపథ్య సంగీతం ట్రైలర్ ను మరో మెట్టు పైన నిలబట్టాయి. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.


Full View


Tags:    
Advertisement

Similar News