ధనుష్ సినిమాను సమర్పిస్తున్న అల్లు అరవింద్

తెలుగులో కూడా ఈమధ్య బిజీ అవుతున్నాడు ధనుష్. నేరుగా తెలుగులోనే 2 సినిమాలు ప్లాన్ చేశాడు. ఒకటి ఆల్రెడీ సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలో ధనుష్ సినిమాలకు టాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడింది.

Advertisement
Update:2022-09-15 19:02 IST

టాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఇప్పుడిప్పుడు ఇతర భాషలపై దృష్టి పెడుతున్నాయి. దిల్ రాజు ఇప్పటికే బాలీవుడ్ లోకి ఎంటరయ్యారు. ఇప్పుడు తెలుగు-తమిళ భాషల్లో విజయ్ తో ఓ సినిమా, రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ కూడా సూర్య సినిమాతో కోలీవుడ్ లోకి ఎంటరైంది. ఇప్పుడు గీతాఆర్ట్స్ వంతు.

గీతా ఆర్ట్స్ సంస్థ కూడా కోలీవుడ్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని సినిమాల్ని నేరుగా కొనుగోలు చేయడం, మరికొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తోంది. తాజాగా ధనుష్ మూవీని ఈ సంస్థ తెలుగులో సమర్పిస్తోంది.

హీరో ధనుష్ ప్రస్తుతం తన సోదరుడు, విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో "నానే వరువేన్" చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. "కాదల్ కొండేన్", "పుదుపేట్టై", "మయక్కం ఎన్న" తర్వాత ధనుష్, సెల్వరాఘవన్ కాంబోలో వస్తున్న 4వ చిత్రం ఇది.

యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కలై పులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో "నేనే వస్తున్నా" పేరుతో రిలీజ్ కానుంది. అగ్ర నిర్మాణ సంస్థ "గీతా ఆర్ట్స్" ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తోంది. ఈ నెల్లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.

Tags:    
Advertisement

Similar News