బచ్చల మల్లి గ్లింప్స్.. ఒక్క డైలాగ్ తో అల్ల‌రోడు విశ్వ‌రూపం చూపించాడుగా!

ప్ర‌స్తుతం బచ్చల మల్లి గ్లింప్స్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక‌పోతే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Advertisement
Update: 2024-06-30 06:28 GMT

ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా ఉన్న అల్లరి నరేష్.. నాంది సక్సెస్ తో సీరియస్ కథలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో ఉన్న చిత్రాల్లో బచ్చల మల్లి ఒకటి. నేడు అల్ల‌రి న‌రేష్ బర్త్‌డే కావ‌డంతో బ‌చ్చ‌ల మ‌ల్లి మూవీ నుంచి మేక‌ర్స్ స్పెష‌ల్ గ్లింప్స్ ను విడుద‌ల చేశారు. 52 సెకెండ్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ లో హీరో క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుందో స్ప‌ష్టంగా చెప్పేశారు.

ఉద‌యాన్నే మైక్ లో భ‌గవ‌ద్గీత వ‌స్తుండ‌గా.. ఒక పల్లెటూరిలో చిన్న పెంకుటిల్లు నుంచి బయటకు వస్తున్న అల్ల‌రి న‌రేష్ ను ప‌రిచ‌యం చేశారు. ఆ తర్వాత మ‌ద్యం షాపు దగ్గర బాటిల్ నుంచి గ్లాసులోకి మందు పోసుకునే విధానంలో హీరో యాటిట్యూడ్ ను చూపించారు. గ్లింప్స్ ఎండింగ్ లో ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి అనే ఒక్క డైలాగ్ తో అల్ల‌రోడు మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో విశ్వ‌రూపం చూపించాడు.

ప్ర‌స్తుతం బచ్చల మల్లి గ్లింప్స్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక‌పోతే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా బచ్చల మల్లి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా అల‌రించ‌బోతోంది.

1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మ‌ల్లి అనే ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ గా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న బచ్చల మల్లి చిత్రం 2024 సెప్టెంబ‌ర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంద‌ని నిర్మాత‌లు క‌న్ఫార్మ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News