Alia Bhatt | అలియా భట్ డీప్ ఫేక్
Alia Bhatt - డీప్ ఫేక్ బారిన పడడం అలియా భట్ కు కొత్తేం కాదు. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి డీప్ ఫేక్ కు గురైంది.
హీరోయిన్లకు ఇప్పుడు అతి పెద్ద భయం పట్టుకుంది. తాము ఎక్కడ డీప్ ఫేక్ బారిన పడతామా అని తెగ భయపడుతున్నారు భామలు. అవును.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో చేసే డీప్ ఫేక్ మార్ఫింగ్ ఇప్పుడు హీరోయిన్లకు ఇబ్బందికరంగా మారుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఉన్నది తాము కాదని చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.
ఇప్పటికే డీఫ్ ఫేక్ బారిన పడిన అలియాభట్, తాజాగా మరోసారి బాధితురాలిగా మారింది. "గెట్ రెడీ విద్ మి" అనే ట్రెండ్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. కొంతమంది అమ్మాయిలు కెమెరా ముందు దుస్తులు వేసుకొని, లైవ్ లో మేకప్ అవుతుంటారు.
అలా రెడీ అవుతున్న ఓ అమ్మాయికి అలియా భట్ ముఖాన్ని తగిలించి మార్ఫింగే చేశారు కొంతమంది. వీడియో చూడ్డానికి డీసెంట్ గానే ఉన్నప్పటికీ, చట్టరీత్యా డీప్ ఫేక్ చేయడం నేరం కాబట్టి నెటిజన్లు, ఆ వీడియో చేసిన వ్యక్తిపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోల్ని సర్కులేట్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
డీప్ ఫేక్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చట్ట సవరణ చేసింది. ఇలా చేసే వాళ్లకు లక్ష రూపాయల జరిమానా, మూడేళ్ల కారాగాన శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ఈ డీప్ ఫేక్ వీడియోపై అలియాభట్ రియాక్ట్ అవ్వలేదు. చూసీచూడనట్టు వదిలేసింది.