అజిత్ పట్టుదల ట్రైలర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో అజిత్ దర్శకుడు మగిజ్‌ తిరుమేని తెరకెక్కించిన సినిమా పట్టుదల ట్రైలర్ రిలీజ్ అయింది.

Advertisement
Update:2025-01-16 20:01 IST

త‌మిళ అగ్ర న‌టుడు అజిత్, దర్శకుడు మగిజ్‌ తిరుమేని తెరకెక్కించిన సినిమా ‘విదాముయార్చి .ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. త్రిష హీరోయిన్‌ నటిస్తోంది. అర్జున్‌ కీలక పాత్ర పోషించారు.. ఈ సినిమాకి తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్‌ ఖరారైంది. ఈ సంక్రాంతికే సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్న చిత్ర బృందం.. అనూహ్యంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజిత్ ను మూడు డిఫరెంట్ గెటప్స్ లో చూపించారు. గతంలో ఈ సినిమా షూటింగ్ లోనే డూప్ లేకుండా ఛేజింగ్ సీన్స్ చేసి అజిత్ ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఈ ట్రైలర్ ఆ షాట్స్ నే చూపిస్తూనే ప్రారంభించారు. ఎడారిలో అజిత్ కారు నడుపుతున్న విజువల్స్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. వెంటనే అజిత్, త్రిష లవ్ స్టోరీని చూపించారు. ఒక వేడుకలో అజిత్ ను చూసిన త్రిష మొదటి చూపులోనే ప్రేమలో పడుతుంది.

Tags:    
Advertisement

Similar News