సంక్రాంతి బ‌రిలో అజిత్ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ

షూటింగ్ విష‌యానికి వ‌స్తే.. కొద్ది రోజుల క్రిత‌మే ఈ సినిమా ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ లో అజిత్ పై ఇంట్రడక్షన్‌ సాంగ్ తో పాటు ఓ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేశారని తెలుస్తోంది.

Advertisement
Update: 2024-06-28 07:47 GMT

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్ర‌స్తుతం హీరోగా చేస్తున్న చిత్రాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఒక‌టి. టాలీవుడ్ లో అన‌తి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థ‌గా పేరు సంపాదించుకున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

మొన్నామ‌ధ్య ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అజిత్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజాగా మేక‌ర్స్ సెకండ్ లుక్ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. గన్‌‌‌‌ ఫైరింగ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ డ్రాప్‌ లో ఈ పోస్ట‌ర్ ను డిజైన్ చేయ‌గా.. అజిత్‌ ఖైదీ గెటప్‌లో స్టైలిష్‌గా చీర్‌ అప్ కొడుతూ క‌నిపించారు. యాక్షన్‌ ప్యాక్డ్‌ డ్రామా నేపథ్యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఉంటుంద‌ని ఫ‌స్ట్ అండ్ సెకండ్ లుక్ పోస్ట‌ర్స్ ద్వారా మేక‌ర్స్ హింట్ ఇచ్చేశారు.

షూటింగ్ విష‌యానికి వ‌స్తే.. కొద్ది రోజుల క్రిత‌మే ఈ సినిమా ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ లో అజిత్ పై ఇంట్రడక్షన్‌ సాంగ్ తో పాటు ఓ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేశారని తెలుస్తోంది. ఇక‌పోతే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని 2025 సంక్రాంతి బ‌రిలో దింప‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా క‌న్ఫార్మ్ చేశారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, భారీ బ‌డ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్‌ యర్నేని, రవిశంకర్ నిర్మాత‌లుగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News