Aishwarya Rai | ఐశ్వర్య రాయ్ ఆస్తి తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!
Aishwarya Rai net worth | దాదాపు 15 ఏళ్లుగా బాలీవుడ్ లో కొనసాగుతోంది ఐశ్వర్యరాయ్. మరి ఆమె ఎంత సంపాదించింది? ఆమె ఆస్తి వెయ్యి కోట్లకు దగ్గరగా ఉందంటే నమ్మగలరా?
ఐశ్వర్య రాయ్ బచ్చన్ చాలా సంవత్సరాలుగా తన ఆకర్షణీయమైన రూపంతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. తమిళ చిత్రం 'ఇరువర్'తో అడుగుపెట్టిన నటి, బాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఆస్తుల నికర విలువ దాదాపు 776 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది ఓ సంస్థ. భారత్ లోని అత్యంత సంపన్న నటీనటుల్లో ఐశ్వర్యరాయ్ కూడా ఒకరు.
నివేదిక ప్రకారం, ఆమె ఒక్కో సినిమాను 10-12 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఇక బ్రాండ్స్ కోసం 6-7 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుంది. అలా కెరీర్ లో 50కిపైగా సినిమాలు, లెక్కలేనన్ని యాడ్స్ చేసి వందల కోట్లు ఆర్జించింది ఐష్.
పాజిబుల్ అనే పోషకాహార ఆధారిత హెల్త్‌కేర్ కంపెనీలో ఐశ్వర్యరాయ్ 5 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ఓ దినపత్రిక వెల్లడించింది. దీనికి అదనంగా, ఆమె బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ అంబీలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అంతేకాదు, ఐశ్వర్యకు అమితాబ్ కు చెందిన ఏబీసీఎల్ కంపెనీలో కూడా వాటా ఉంది. అందులో ఆమె చురుగ్గా ఉంది.
ఆమెకు ఇప్పటికీ సినిమా ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో నటించింది. ఆ సినిమా కోసం ఆమె 10 కోట్లు తీసుకుంది. మరో మూడేళ్లు ఇలానే కెరీర్ కొనసాగిస్తే, ఆమె ఆస్తి విలువ వెయ్యి కోట్లకు చేరుతుందని ఓ అంచనా.