Aishwarya Arjun | ఘనంగా ఐశ్వర్య అర్జున్ పెళ్లి

Aishwarya Arjun - సీనియర్ నటుడు అర్జున్ కూతురు, హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పెళ్లి చెన్నైలో ఘనంగా జరిగింది.

Advertisement
Update:2024-06-11 23:02 IST

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న (జూన్ 10న) చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈ వివాహ వేడుక జరిగింది.

జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమైంది. 8వ తేదీన మెహందీ, 9వ తేదీన సంగీత్ జరిగింది.

జూన్ 10 న ఉదయం 9 - 10 గంటల మధ్య సినీ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య-ఉమాపతి పెళ్లితో ఒకటయ్యారు. రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరగనుంది.

ఈ పెళ్లికి విశాల్, కార్తి లాంటి హీరోలు హాజరయ్యారు. ఎస్ జే సూర్య, విజయ్ కుమార్ లాంటి ప్రముఖులు కూడా వచ్చారు. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్నారు ఐశ్వర్య-ఉమాపతి. పెద్దల అంగీకారంతో ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.








Tags:    
Advertisement

Similar News