ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న అయ్య‌గారి ఏజెంట్‌

ఇప్పుడు ఏజెంట్ మూవీ ఓటీటీ కంటే ముందే టీవీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

Advertisement
Update: 2024-07-01 10:49 GMT

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ర‌క‌ర‌కాల క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్నా భారీ హిట్ మాత్రం ప‌డ‌టం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకున్న అఖిల్ ఆ వెంట‌నే ఏజెంట్ పేరుతో ఒక హై బ‌డ్జెట్ సినిమా చేశాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా, విక్రమజీత్ విర్క్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు.

2023 ఏప్రిల్ 8న భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఏజెంట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. రూ. 85 కోట్ల‌తో సినిమాను తీస్తే.. క‌నీసం ప‌ది కోట్లు వ‌సూళ్లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఇకపోతే ఏజెంట్ విడుద‌లై రెండు నెల‌ల క్రిత‌మే ఏడాది పూర్తైంది. కానీ ఇంత వ‌ర‌కు అయ్య‌గారి సినిమా ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. ఏజెంట్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్ ద‌క్కించుకున్నా.. ఏవో అడ్డంకుల వల్ల స్ట్రీమింగ్ మాత్రం అవ్వ‌లేదు.

అయితే ఇప్పుడు ఏజెంట్ మూవీ ఓటీటీ కంటే ముందే టీవీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. అవును, ఏజెంట్ హిందీ వెర్షన్ ను త్వరలోనే గోల్డ్‌మైన్స్ టీవీలో టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. అయితే కచ్చితంగా ఏ రోజు వ‌స్తుందన్న‌ది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ జూలై నెల‌లో అఖిల్ మూవీ స్మాల్ స్క్రీన్ పై సంద‌డి చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కాగా, ఏజెంట్ కి వక్కంతం వంశీ కథ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర సినిమాను నిర్మించ‌గా.. హిప్ హాప్ తమిజా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Tags:    
Advertisement

Similar News