నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా

నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా

Advertisement
Update:2024-10-04 13:33 IST

సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో మంత్రి సురేఖపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరగనున్నది.

మంత్రి కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించారు. వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. సమంత-నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆరే అని ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన అక్కినేని కుటుంబం మంత్రి వ్యాఖ్యలపై మండిపడింది.రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన వ్యాఖ్యలు చేయడంపై సినీ ప్రముఖులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదని, ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రికి సూచించారు.

ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. నా నోటి నుంచి అనుకోకుండా ఓ కుటుంబం పేరు వచ్చింది. మరొకరిని నొప్పించాలని తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను అన్నారు. అయినా సీని ఇండ్రస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలపై ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలోనే నాగార్జున మంత్రి సురేఖపైపరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News