Adivi Sesh: ఇమేజ్ ఉందని పాన్ ఇండియా సినిమా చేయకూడదు!

హిట్-2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అడివి శేష్. ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు శేష్.

Advertisement
Update:2022-11-24 08:50 IST

పాన్ ఇండియా ప్రాజెక్టులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు హీరో అడివి శేష్. ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని అనుకోకూడదని, మరీ ముఖ్యంగా ఇమేజ్ ఉందని, పాన్ ఇండియా లెవెల్లో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదంటున్నాడు. పాన్ ఇండియా అప్పీల్ అనేది కథలో ఉండాలని, హీరోలో కాదని చెబుతున్నాడు.

"పాన్ ఇండియన్ అనేది కథలో ఉండాలి. ఇమేజ్ ఉంది కదా అని పాన్ ఇండియన్ చేయకూడదు. హిట్-2 సినిమాను హిందీలో రిలీజ్ చేయండని ఆడియెన్స్ అడుగుతుండటంతోనే మాకు కూడా ఆలోచన వచ్చింది. అయితే తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయడం లేదు. హిందీ వర్షన్‌లో కాస్త ఆలస్యంగా విడుదలవుతుంది."

ఇలా పాన్ ఇండియా ప్రాజెక్టులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అడివి శేష్. మేజర్ సినిమాతో పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకున్న ఈ హీరో, హిట్-2 సినిమాలోని కథకు పాన్ ఇండియా అప్పీల్ ఉందంటున్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని తను నిర్మాత నానిని కోరానని, దానికి నాని అంగీకరించడం ఆనందంగా ఉందన్నాడు.

Tags:    
Advertisement

Similar News