Adipurush - బాలీవుడ్ లో ఇక బి, సి సెంటర్లే దిక్కు

Adipurush - దేశవ్యాప్తంగా ఆదిపురుష్ వసూళ్లు పడిపోయాయి. ప్రస్తుతం మేకర్స్, ఉత్తరాదిన ఉన్న బి, సి సెంటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు.

Advertisement
Update:2023-06-22 18:03 IST

మల్టీప్లెక్స్ జనాలకు ఈ గ్రాఫిక్స్ కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే అవతార్ చూసిన కళ్లతో ఆదిపురుష్ చూడలేరు. అయితే బి, సి సెంటర్లలో రామాయణంపై జనాలకు ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. నార్త్ బెల్ట్ లో ఆదిపురుష్ సినిమాను ఆదుకునేది బి, సి సెంటర్లే.

ఈ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. రామాయణాన్ని వక్రీకరించారని దుమ్మెత్తిపోస్తున్న ధార్మిక సంఘాలు కూడా ఉన్నాయి. ఈ నెగెటివ్ టాక్ కు తగ్గట్టే సోమ, మంగళ, బుధవారాలు సినిమాకు భారీగా వసూళ్లు తగ్గిపోయాయి.

నార్త్ బెల్ట్ లో సోమవారం ఆదిపురుష్ సినిమాకు 9 కోట్ల రూపాయల నెట్ రాగా, మంగళవారం ఈ వసూళ్లు 5.50 కోట్ల రూపాయలకు పడిపోయాయి. ఇక బుధవారం ఏకంగా 3.5 కోట్లకు పడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ వసూళ్లలో ఎక్కువ భాగం ఉత్తరాదిన ఉన్న సెమీ-అర్బన్, రూరల్ లొకేషన్ల నుంచి వచ్చినవే.

సో.. ఆదిపురుష్ సినిమా ఉత్తరాదిన మరికొన్నిరోజులు నడవాలంటే బి, సి సెంటర్లే దిక్కు. సినిమాపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, బాలీవుడ్ లో మరో మూవీ అందుబాటులో లేకపోవడంతో బి, సి సెంటర్ జనాలు ఆదిపురుష్ చూస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది ట్రేడ్.

అయితే ఈ సెంటర్ల ఆడియన్స్ నుంచి ఈ సినిమా గట్టెక్కుతుందని భావిస్తే అది భ్రమే అవుతుందని చెబుతున్నారు. నార్త్ లో ఆదిపురుష్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు కష్టం అనేది అందరి మాట. నిన్న ఆదిపురుష్ హిందీ వెర్షన్ ఆక్యుపెన్సీ కేవలం 11.16 శాతం మాత్రమే.

Tags:    
Advertisement

Similar News