త్రిషపై మన్సూర్ అలీఖాన్ అసభ్యకర వ్యాఖ్యలు.. ఘాటు రిప్లై ఇచ్చిన నటి

'మన్సూర్ అలీఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియోను చూశా. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా ఉన్నాయి.

Advertisement
Update:2023-11-19 11:01 IST

తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కోలీవుడ్ ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్‌కు హీరోయిన్ త్రిష ఘాటు రిప్లై ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో మూవీ కొద్ది రోజుల కిందట విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ లియో సినిమా గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా త్రిష గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. 'నేను కూడా లియో సినిమాలో నటించా. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా చేసింది. రేప్ సీన్లలో నటించడం నాకు కొత్త కాదు. గతంలో నేను చాలా సినిమాల్లో రేప్ సీన్లలో నటించా. లియోలో కూడా నేను త్రిషను బెడ్ రూమ్‌కి తీసుకెళ్లే సీన్ ఉంటుందని భావించా. కానీ అలాంటి సీన్ ఒక్కటి కూడా పెట్టలేదు. కశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.' అని మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ చేశాడు.

మన్సూర్ చేసిన ఈ కామెంట్స్ కోలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. పలువురు సినీ నటులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాద, హీరోయిన్ మాళవిక మోహన్, లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు.

కాగా, తాజాగా తన పట్ల మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్లపై హీరోయిన్ త్రిష స్పందించింది. 'మన్సూర్ అలీఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియోను చూశా. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా ఉన్నాయి. మన్సూర్ అలీఖాన్ లాంటి వ్యక్తితో ఇప్పటివరకు నేను స్క్రీన్ పంచుకోకపోవడం అదృష్టంగా భావిస్తున్నా. జీవితంలో ఇకపై ఎప్పుడూ నేను నటించే సినిమాల్లో అతడు లేకుండా చూసుకుంటాను. మన్సూర్ అలీఖాన్ లాంటి వ్యక్తుల వల్ల సమాజంలో అందరికీ చెడ్డపేరు వస్తోంది.' అని త్రిష అభిప్రాయపడింది.

Tags:    
Advertisement

Similar News