TiruVeer: తిరువీర్ అసలు పేరు తెలుసా?

Actor TiruVeer: మసూద తో మరో హిట్ కొట్టాడు తిరువీర్. ఈ సందర్భంగా తన అసలు పేరు బయటపెట్టాడు.;

Advertisement
Update:2022-11-29 13:43 IST
TiruVeer: తిరువీర్ అసలు పేరు తెలుసా?
  • whatsapp icon

తిరువీర్.. ఈ నటుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పలాస, టక్ జగదీశ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మసూద మూవీతో మరోసారి అందర్నీ ఆకట్టుకున్నాడు. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఇంతకీ తిరువీర్ అసలు పేరు ఇదేనా? 


"నా పేరు తిరుపతి రెడ్డి. నేను గురువుగా భావించే రఘువీర్ నుంచి వీర్ అని తీసుకుని తిరువీర్ అని పెట్టుకున్నా. అయితే వీర్ అనేది మరో సెంటిమెంట్‌ కూడా. వీరమ్మ అనేది మా అమ్మ పేరు. అమ్మ, గురువు నుంచి తీసుకోవడంతో తిరువీర్ అనేది నాకు రెండు రకాలుగా సెంటిమెంట్ అయింది."


ఇలా తిరుపతి రెడ్డి కాస్తా తిరువీర్ అయ్యాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. మసూద సక్సెస్ సందర్భంగా తిరువీర్ ఇలా ఈ విషయాన్ని బయటపెట్టాడు. రెమ్యూనరేషన్ కోసం సినిమాలు చేయనంటున్నాడు ఈ హీరో. కథ, స్క్రీన్ ప్లే నచ్చితేనే సినిమాలు చేస్తానంటున్నాడు.


ఇప్పటివరకు తనకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చాయని, కానీ తనకు కామెడీ చేయడం చాలా ఇష్టమని అంటున్నాడు. పైగా తను కామెడీ బాగా చేస్తానని, ఎవరైనా తనకు కామెడీ రోల్ ఉంటే ఇవ్వాలని కోరుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News