Actor Sunil: కోలీవుడ్ లో బిజీ అయిన సునీల్

Actor Sunil - ఊహించని విధంగా కోలీవుడ్ లో బిజీ అయ్యాడు సునీల్. అతడికి తమిళనాట వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి.;

Advertisement
Update:2023-01-22 14:10 IST
Actor Sunil: కోలీవుడ్ లో బిజీ అయిన సునీల్
  • whatsapp icon

ఒక్క సినిమా, ఒకే ఒక్క సినిమా.. తారల జాతకాల్ని మార్చేస్తుంది. ఒక్క ఛాన్స్ అంటూ నటీనటులు పరితపించేది అందుకే. ఇప్పుడా అవకాశం సునీల్ కు వచ్చింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ నటుడికి పుష్ప రూపంలో అనుకోని అవకాశం దక్కింది. అలా పుష్ప ఇచ్చిన ఉత్సాహంతో చెలరేగిపోతున్నాడు సునీల్.

పుష్ప సినిమాలో విలన్ గా నటించాడు సునీల్. అందులో అతడి పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో కోలీవుడ్ నుంచి సునీల్ కు వరుసపెట్టి అవకాశాలొస్తున్నాయి. అన్నీ విలన్ పాత్రలే.

రజనీకాంత్ హీరోగా జైలర్ అనే సినిమా వస్తోంది. ఇందులో విలన్ గా సునీల్ ను తీసుకున్నారు. ఈమధ్య ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మావీరన్ (మహావీరుడు) సినిమాలో కూడా విలన్ సునీలే. ఈ సినిమాలతో పాటు కార్తి నటిస్తున్న జపాన్, విశాల్ చేస్తున్న మార్క్ ఆంటోనీ సినిమాల్లో కూడా సునీల్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇలా టాలీవుడ్ లో పెద్ద హీరోలంతా సునీల్ ను తమ సినిమాల్లో విలన్ గా తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్టులతో పాటు 2 బాలీవుడ్ సినిమాలు, మరికొన్ని కన్నడ సినిమాల్లో నటిస్తున్నాడు సునీల్. ఇవి కూడా విలన్ పాత్రలే. ఇదంతా పుష్ప మహత్యం. 

Tags:    
Advertisement

Similar News