నటుడు మోహన్‌బాబు అరెస్టు తథ్యం

నటుడు మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

Advertisement
Update:2024-12-16 13:47 IST

సినీ నటుడు మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. మోహన్ బాబు, మనోజ్‌కు సంబంధి 3 ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని సీపీ వెల్లడించారు. ఈ నెల 24 వరుకు గడువు అడిగారని తెలిపారు.ఇప్పటికే మోహన్‌బాబుకు నోటీసులు జారీ చేశామని మరోసారి ఇస్తామని పేర్కొన్నారు. స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని తెలిపారు. మోహన్‌బాబు వల్ల రంజిత్‌ గాయపడ్డారు కాబట్టి, సానుభూతితో పలకరించడానికి వెళ్లి ఉంటారు. అయితే, చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాగే తీసుకుంటాం. మరోవైపు కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చింది. కోర్టు ఆదేశాలను మేం గౌరవిస్తాం. ఈలోగా మరోసారి మోహన్‌బాబుకు నోటీసు ఇచ్చి, గడువు కన్నా ముందే విచారణ చేపట్టవచ్చా? అని కోర్టును అడుగుతాం. కోర్టు ఇచ్చే సూచనలను బట్టి నడుచుకుంటామని సీపీ తెలిపారు

Tags:    
Advertisement

Similar News