షూటింగ్‌లో ప్రమాదం..బాలీవుడ్ హీరోకు గాయాలు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2024-12-12 17:55 IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అక్షయ్ గాయపడ్డాడని టాక్. ప్రస్తుతం ముంబైలో ఆయన హీరోగా నటిస్తు హౌస్‌ఫుల్ 5’జరుగుతోంది. ఈ మూవీ కోసం అక్షయ్ స్టంట్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో కంటికి గాయమైందనట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెట్‌లో ఉన్న చిత్రబృందం… ఐ డాక్టర్ ను పిలిపించారు. వైద్యులు అక్షయ్ కుమార్ కంటికి తగిలిన గాయాన్ని పరీక్షించి, కంటికి కట్టు కట్టి, విశ్రాంతి తీసుకోమని చెప్పారు.హౌస్‌ఫుల్ 5’లో అభిషేక్ బచ్చన్, శ్రేయాస్ తల్పాడే, చుంకీ పాండే, జాక్వెలీన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ తదితరులు మరోసారి ఈ సీక్వెల్ లో భాగం కాబోతున్నారు. అక్షయ్ , రితీష్ దేశ్‌ముఖ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News