7/G Brundavan Colony | రీ-రిలీజ్ కు రెడీ అయిన కల్ట్ మూవీ

7/G Brundavan Colony - కల్ట్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది 7/G బృందావన కాలనీ. ఇప్పుడీ సినిమా రీ-రిలీజ్ అవుతోంది.

Advertisement
Update:2023-09-17 22:51 IST

ప్రముఖ నిర్మాత ఏయం రత్నం నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ వెండితెరపై ఆవిష్కరించిన కల్ట్ క్లాసిక్ ‘7/జీ బృందావన్‌ కాలనీ’. రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా సంచలన విజయం సాధించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.

ఇప్పుడీ సినిమా మరోసారి ప్రేక్షకులని అలరించనుంది. నిర్మాతలు ఉదయ్, యతి ఏయు సినిమాస్ & వివై ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సెప్టెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రీ-రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు మేకర్స్.

ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం ‘7/జీ బృందావన్‌ కాలనీ’ గురించి మాట్లాడాడు. అంతేకాదు, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారాయన.

"నేను చేసిన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో 7/జీ బృందావన్‌ కాలనీ కల్ట్ మూవీ. ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. తెలుగు తమిళ్ రెండూ భాషల్లో పెద్ద విజయం సాధించింది. ఇదొక పోయిటిక్ సినిమా. సినిమా ప్రారంభం ముగింపు పొయిటిక్ గా ఉంటాయి. ఉదయ, యతి చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని రి-రిలీజ్ చేస్తున్నారు. రీ-రిలీజ్ లో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. రవికృష్ణతో మళ్ళీ రీ-ఎంట్రీలా ‘7/జీ బృందావన్‌ కాలనీ’ పార్ట్ 2 ని వచ్చే నెల నుంచి మొదలుపెడుతున్నాం. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది."

ఇలా సీక్వెల్ ను ప్రకటించాడు ఏఎం రత్నం. ఈసారి మరింత ఎమోషనల్ గా సినిమా ఉంటుందంటున్నారు. రీ-రిలీజ్ పై రవికృష్ణ కూడా స్పందించాడు. తను ఈ సినిమా చూస్తే చాలా ఎమోషనల్ అయిపోతానని, అందుకే ఇప్పటివరకు ఒకే ఒక్కసారి సినిమా చూశానని అన్నాడు.

Full View

Tags:    
Advertisement

Similar News