ఈ రోజు 11 సినిమాలు విడుదల!

ఈ రోజు శుక్రవారం మొత్తం 11 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కొత్తవాళ్ళతో లో - బడ్జెట్ సినిమాలే. వీటిలో కామెడీ, రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాలు, టీనేజి రోమాంటిక్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్లు, సైకలాజికల్ థ్రిల్లర్, హార్రర్ కామెడీలు... ఇలా 7 వెరైటీ లున్నాయి.

Advertisement
Update:2024-06-21 14:31 IST

ఈ రోజు శుక్రవారం మొత్తం 11 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కొత్తవాళ్ళతో లో - బడ్జెట్ సినిమాలే. వీటిలో కామెడీ, రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాలు, టీనేజి రోమాంటిక్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్లు, సైకలాజికల్ థ్రిల్లర్, హార్రర్ కామెడీలు... ఇలా 7 వెరైటీ లున్నాయి. 1998 లో విడుదలైన కన్నడ హీరో నటించిన సూపర్ హిట్ ‘ఏ’ రీరిలీజ్ కూడా వీటిలో వుంది. ఈ వారం ప్రేక్షకులు ఈ 11 సినిమాలతో బిజీగా వుండొచ్చు. వివరాలు కింద చూద్దాం.

1. మరణం : హార్రర్ థ్రిల్లర్. తారాగణం మమతా హారిక, మాధురి, ప్రార్ధన; దర్శకత్వం సాగర్ శైలేష్.

2. హనీమూన్ ఎక్స్ ప్రెస్ : రోమాంటిక్ కామెడీ. తారాగణం చైతన్య, హెబ్బా పటేల్, సుహాసినీ మణిరత్నం; దర్శకత్వం బాలా రాజశేఖరుని.


Full View


3. ప్రభుత్వ జూనియర్ కళాశాల : టీనేజి రోమాంటిక్ డ్రామా. తారాగణం ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజా గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల; దర్శకత్వం శ్రీనాథ్ పులకురం.

4. సందేహం : రోమాంటిక్ సస్పెన్స్ . తారాగణం సుమన్ వూట్కూర్, హెబ్బా పటేల్; దర్శకత్వం సతీష్ పరమవేద.


Full View


5. నింద : సస్పెన్స్ థ్రిల్లర్. తారాగణం వరుణ్ సందేశ్ , దర్శకత్వం రాజేష్ జగన్నాథం.

6. ఇట్లు మీ సినిమా : కామెడీ. అభిరామ్ కృష్ణ, పవన్ మనోహర; దర్శకత్వం హరీష్ చావా.

7. ఓఎంజి (ఓ మంచి ఘోస్ట్) : హార్రర్ కామెడీ. తారాగణం వెన్నెల కిషోర్, నందితా శ్వేత, శకలక శంకర్, నవీన్ నేనీ; దర్శకత్వం : శంకర్ మార్తాండ్.

8. పద్మవ్యూహంలో చక్రధారి : సస్పెన్స్ థ్రిల్లర్. తారాగణం : ప్రవీణ్ రాజ్ కుమార్, శశికా తిక్కూ, ఆశు రెడ్డి, భూపాల్; దర్శకత్వం సంజయ్ రెడ్డి బంగారపు.

9. సీతా కళ్యాణం వైభోగమే : రొమాంటిక్ డ్రామా. తారాగణం : సుమన్, గరీమా, నాగినీడు, ప్రభావతీ. దర్శకత్వం సతీష్ పరమవేద.

10. ‘ఏ’ : సైకలాజికల్ థ్రిల్లర్. తారాగణం ఉపేంద్ర, చండినీ, అర్చనా; దర్శకత్వం ఉపేంద్ర.

11. అంతిమ తీర్పు : సస్పెన్స్ థ్రిల్లర్. తారాగణం ధన్సిక, సత్య ప్రకాష్, గణేష్ వెంకట్రామన్; దర్శకత్వం అభిరాము.

Tags:    
Advertisement

Similar News