సుబ్బారావు హోటల్‌లో ఇడ్లీ ధరలాగే 'పుష్ప2' టికెట్‌ రేట్స్‌

లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్‌ బట్టల ధరలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్‌ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారని ఆర్జీవీ ట్వీట్‌

Advertisement
Update:2024-12-04 15:28 IST

వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ వర్తమాన అంశాలపై తనదైన మార్క్‌ ట్వీట్స్‌ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. దీంతో అవి వైరల్‌గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్‌ 'పుష్ప2 ది రూల్‌'పై ఎక్స్‌ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్టు పెట్టారు. 'పుష్ప2' టికెట్‌ ధరలను పెంచుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం విదితమే. భారీగా పెరిగిన టికెట్‌ ధరలపై కొన్నివర్గాలు సోషల్‌ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలను అరికట్టాలని కోరుతూ కొందరు కోర్టులనూ ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆర్జీవీ చేసిన ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. 'పుష్ప2' టికెట్లను స్టార్‌ హోటల్‌ ఇడ్లీతో పోల్చారు.

సుబ్బారావు అనే ఒకడు హోటల్‌ పెట్టి.. ప్లేట్‌ ఇడ్లీ ధరను రూ. 1000గా నిర్ణయించాడు. అంతధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు ఆ ఇడ్లీలు అంత వర్త్‌ అనిపించకపోతే, వాడు అతని హోటల్‌కు వెళ్లడు. దీంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరూ కాదు. 'సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదు' అని ఎవరైనా ఏడిస్తే, అది 'సెవెన్‌స్టార్‌ హోటల్‌ సామాన్యులకు అందుబాటులో లేదు' అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ 'సెవెన్‌ స్టార్‌ హోటల్‌లో యాంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం' అని వాదిస్తే, పుష్ప2 విషయంలో ఆ క్వాలిటీ అనేదే సినిమా. డెమోక్రటిక్‌ క్యాపిటలిజం అనేది క్లాస్‌ డిఫరెన్స్‌ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్‌లాగే సినిమాలూ లాభాల కోసమే నిర్మిస్తారు. అంతేగాని ప్రజాసేవ కోసం కాదు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్‌ బట్టల ధరలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్‌ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు? అని ప్రశ్నించారు.

ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాడింగ్‌ ఉన్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి 'పుష్ప2' మూవీకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకోని వారు చూడటం మానేయవచ్చు. లేదా రేట్లు తగ్గాక చూడవచ్చు కదా? మళ్లీ సుబ్బారావు హోటల్‌ విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్‌ అయిపోయింది. దానికి ఫ్రూఫ్‌ ఏమిటంటే ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్‌ అయిపోయాయి అని పోస్టు పెట్టారు. 

Tags:    
Advertisement

Similar News