ఈఎంఐల్లో వస్తువులు కొనేముందు ఇవి తెలుసుకోండి!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో దసరా, దీపావళి సేల్స్ నడుస్తున్నాయి. ఈ సేల్స్‌లో స్పెషల్ ఆఫర్ కింద చాలా ప్రొడక్ట్స్‌కు ‘నోకాస్ట్ ఈఎంఐ’, ‘బై నౌ పే లేటర్’ వంటి ఆప్షన్లు ఇస్తుంటాయి కంపెనీలు.

Advertisement
Update:2023-10-11 17:15 IST

ఈఎంఐల్లో వస్తువులు కొనేముందు ఇవి తెలుసుకోండి!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో దసరా, దీపావళి సేల్స్ నడుస్తున్నాయి. ఈ సేల్స్‌లో స్పెషల్ ఆఫర్ కింద చాలా ప్రొడక్ట్స్‌కు ‘నోకాస్ట్ ఈఎంఐ’, ‘బై నౌ పే లేటర్’ వంటి ఆప్షన్లు ఇస్తుంటాయి కంపెనీలు. అయితే వీటిని ఎంచుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

ఇ–కామర్స్ సంస్థలు అందించే నో కాస్ట్ ఈఎంఐ, పే లేటర్ వంటి ఆప్షన్లకు చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. చేతిలో డబ్బులేకపోయినా ‘ఈఎంఐ ఆప్షన్‌లో కొనేయొచ్చులే’ అనుకుంటారు. అయితే ఇలా కొనేముందు కొన్ని విషయాలు గమనించాలి.

ఈఎంఐ ఆప్షన్‌లో ప్రొడక్ట్ ధర మొత్తాన్ని ఒకేసారి కాకుండా వాయిదాల రూపంలో చెల్లించొచ్చు. దీనికిగానూ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఈఎంఐ అమౌంట్ తక్కువ ఉండేలా ఎక్కువ టైం పీరియడ్ పెట్టుకుంటారు. దీనివల్ల ఈఎంఐ తగ్గుతుంది. కానీ, వడ్డీ పెరుగుతుంటుంది. అందుకే వీలైనంత తక్కువ పీరియడ్ పెట్టుకోవాలి.

ఇక నో-కాస్ట్‌ ఈఎంఐ విషయానికొస్తే.. వడ్డీ లేకుండా కేవలం ప్రొడక్ట్ ధర మొత్తాన్ని మాత్రమే వాయిదా రూపంలో కట్టే ఆప్షన్ ఇది. ఈ ఆప్షన్‌లో ఎలాంటి వడ్డీ భారం ఉండదు. ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్నప్పుడు కొన్నిసార్లు డిస్కౌంట్ అప్లై చేయకుండా ప్రోడక్ట్‌ ఒరిజినల్ ధరను ఈఎంఐ కిందకు మారుస్తారు. అలాగే మరికొన్నిసార్లు ప్రొడక్ట్‌తో పాటు రావాల్సిన ఇతర యాడ్ ఆన్ వస్తువులు, ఆఫర్‌‌లో ఉచితంగా ఇవ్వాల్సిన వస్తువులను తీసేస్తుంటారు. వస్తువు కొనేముందు ఇది కూడా చెక్ చేసుకోవాలి.

నో కాస్ట్ ఈఎంఐల్లో.. ఈఎంఐ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. తద్వారా ప్రతినెలా ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. టైంకు వాయిదా కట్టకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అలాగే కొన్ని ప్రొడక్ట్స్‌కు నోకాస్ట్ ఈఎంఐ పొందాలంటే ముందే కొంత డౌన్‌పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ గమనించుకుని నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఏదేమైనా ఇంటికి అవసరమైన పెద్ద వస్తువులు కొనేందుకు నోకాస్ట్ ఈఎంఐ మంచి ఆప్షన్‌గానే చెప్పుకోవచ్చు.

ఇక బై నౌ పే లేటర్ విషయానికొస్తే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది లోన్ లాంటిది. పే లేటర్ ఆప్షన్‌ను అందించే సంస్థలు ఆయా ప్రొడక్ట్‌కు అయ్యే ఖర్చు తామే భరించి తర్వాత దాన్ని లోన్ రూపంలో కన్వర్ట్ చేస్తాయి. సాధారణ ఈఎంఐతో పోలిస్తే ఇందులో వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు ఎక్కువగా ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News