లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రోజంతా ఆశాజనకంగా సాగిన ట్రేడింగ్
Advertisement
ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఈ వారం ఆరంభమే లాభసాటిగా ఉండటంతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. సోమవారం ఉదయం 76,978.53 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడింది. చివరికి 454.11 పాయింట్ల లాభంతో 77,073.44 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 141.55 పాయింట్ల లాభంతో 23,344.75 పాయింట్ల వద్ద ముగిసింది. చాలా రోజుల తర్వాత రూపాయి కాస్త బలపడింది. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఐదు పైసలు బలపడి 86.55 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్ర బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడగా, మారుతి సుజికి, టీసీఎస్, జొమాటో, అదానీ పోర్ట్స్, మహీంద్ర అండ్ మహీంద్ర షేర్లు నష్టపోయాయి.
Advertisement