ట్రంప్‌ ప్రమాణ స్వీకారం వేళ..ఒడుదొడుకుల్లో మార్కెట్లు

ప్రారంభంతో లాభాలతో మొదలై తర్వాత మళ్లీ పడిపోయిన సూచీలు

Advertisement
Update:2025-01-20 11:37 IST

లాభాలతో మొదలైన భారత స్టాక్‌ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం వేళ.. మదుపర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. ప్రారంభంలో సెన్సెక్స్‌ 125 పాయింట్లకు పైగా లాభంలో దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత మళ్లీ కిందికి పడిపోయింది. ప్రస్తుతం 11 గంటల సమయంలో సెన్సెక్స్‌ 421.43 పాయింట్ల లాభంతో 77040.76 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ మొదట్లో లాభంతో 23,250 మార్క్‌ను తాకినప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. 70.00పాయింట్ల లాభంతో 23273.20 పాయింట్లతో కొనసాగుతున్నది. బ్యాకింగ్‌ షేర్లు లాభాలో కొనసాగుతుండటం విశేషం. కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌తో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లైప్‌ ఇన్సూరెన్స్‌, టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్టీస్‌, టాటా మోటార్స్‌ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. 



Tags:    
Advertisement

Similar News