కొత్త శిఖరాలకు దేశీయ స్టాక్ మార్కెట్లు
85 వేల మార్క్ దాటిన సెన్సెక్స్.. 26 వేల పాయింట్లు దాడిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలకు చేరాయి. ఆల్ టైం హైతో కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో మంగళవారం ఉదయం నుంచి ట్రేడింగ్ పాజిటివ్ గా మొదలైంది. మధ్యాహ్నానికి సెన్సెక్స్ 85 వేల మార్క్ క్రాస్ చేయగా, నిఫ్టీ 26 వేల పాయింట్లను క్రాస్ చేసింది. సాయంత్రానికి మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సోమవారం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ 14 పాయింట్లు, నిఫ్టీ ఒక పాయింట్ నష్టపోయాయి. సెన్సెక్స్ 84,914 పాయింట్లు, నిఫ్టీ 25,940 పాయింట్ల వద్ద ముగిశాయి. బాంబే, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్, హిందాల్కో, టాటా స్టీల్ లాభాలు గడించాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు నష్టపోయాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 75 డాలర్ల వద్ద, ఔన్స్ బంగారం ధర 2,657 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.