పీఎఫ్‌ సొమ్ము ఇకపై ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు

ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Advertisement
Update:2024-12-11 20:52 IST

కోట్లాది మంది ప్రావిడెండ్‌ ఫండ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్‌ ఎకౌంట్లలో జమ చేసుకున్న సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించబోతుంది. వచ్చే ఏడాది నుంచి అంటే 2025 నుంచే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా డావ్రా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో)లో ఏడు కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. తమ వేతనాల నుంచి ప్రతి నెల 12 శాతాన్ని పీఎఫ్‌ ఖాతాలో జమ చేసుకుంటారు. ఉద్యోగం చేసే కంపెనీ కూడా అంతే మొత్తంలో ఉద్యోగి పీఎఫ్‌ ఎకౌంట్‌లో జమ చేస్తుంది. ఇలా జమ చేసిన మొత్తాన్ని ఏదైనా అవసరాల కోసం విత్‌ డ్రా చేసుకోవాలంటే సవాలక్ష ప్రయత్నాలు చేయాలి. అయినా వారం, పది రోజుల వరకు ఉద్యోగి ఖాతాలో నగదు జమ కాదు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్‌వో 3.0 పథకాన్ని తీసుకురాబోతుంది. దీనిలో భాగంగా పీఎఫ్‌ ఎకౌంట్‌ హోల్డర్లకు ఏటీఎంను పోలిన కార్డులు అందజేస్తారు. ఆ కార్డు సాయంతో దేశంలోని ఏ ఏటీఎం నుంచైనా డబ్బు విత్‌ డ్రా చేసుకోవచ్చు. 2025 జూన్‌ నుంచి ఈ పథకం ప్రారంభం కాబోతుందని కేంద్రం వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News