నష్టాల్లో మొదలైన మార్కెట్‌ సూచీలు

వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు నేడు అదే బాట పట్టాయి

Advertisement
Update:2025-02-12 10:12 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు నేడు అదే బాట పట్టాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 23,500 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టగా.. సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 86.53 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 76.75 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,917.60 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 10.10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 852.53 పాయింట్ల నష్టంతో 75441.07 వద్ద.. నిఫ్టీ 213.20 పాయింట్లు తగ్గి 22858.60 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జొమాటో, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News